IND vs OMA: ఒమన్‌తో మ్యాచ్.. ఇండియా బ్యాటింగ్.. బుమ్రా, వరుణ్‌లకు రెస్ట్

IND vs OMA: ఒమన్‌తో మ్యాచ్.. ఇండియా బ్యాటింగ్.. బుమ్రా, వరుణ్‌లకు రెస్ట్

ఆసియా కప్ 2025లో చివరి లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 19) పసికూన ఒమన్ తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి. ఇండియా ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించగా.. నేడు టీమిండియాపై గెలిచినా ఒమన్ ఇంటిదారి పట్టనుంది.

నామమాత్రంగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడు. రుణ్ చక్రవర్తి స్థానంలో అర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు ఒమాన్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. 

భారత్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్