టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఇది ఒక యాడ్ షూటింగ్‌లో జరిగినట్లు సమాచారం. గాయపడడంతో ఆయనను తన సిబ్బంది వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించారు.
జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారని తెలియగానే అభిమానులు అందోళన చెందుతున్నారు. అయితే స్వల్ప గాయాలే అయ్యాయని అయన టీమ్ తెలిపింది. గాయాలు తీవ్రమైనవి కానప్పటికీ, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వెల్లడించారు.
వైద్య పరీక్షల తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన బృందం తెలిపింది. గాయాలు స్వల్పమైనవే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని వెల్లడించింది. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుత్తం జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో 'కాంతార' ఫేమ్, నటుడు రిషబ్ శెట్టి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే.. ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్ ఒకే తెరపై కనిపించనున్నారు.
'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ 'డ్రాగన్' సినిమా వాటి కంటే కూడా భారీగా ఉంటుందని టాక్ వినపిస్తోంది . తన కెరీర్ ప్రారంభం నుండి తీయాలనుకున్న సినిమా కూడా ఇదేనని సినీ వర్గాలు తెలిపాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా కథకు ఎలాంటి పరిమితులు లేకుండా నీల్ తన విజన్‌ను పూర్తి స్థాయిలో చూపించబోతున్నారని సమాచారం. ఇది ఇండియన్ సినిమాకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక ఈ 'డ్రాగన్' సినిమా ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మే 20 న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, సంగీత దర్శకుడు రవి బస్రూర్ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
