Joe Root: ఇండియన్‌కే ఓటు.. ఫైనల్ రౌండ్‌లో కోహ్లీ ఔట్: ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరో చెప్పిన జో రూట్

Joe Root: ఇండియన్‌కే ఓటు.. ఫైనల్ రౌండ్‌లో కోహ్లీ ఔట్: ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరో చెప్పిన జో రూట్

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‎లో దూసుకెళ్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‎లో వేల కొద్ది పరుగులు చేస్తూ దిగ్గజాల రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డ్ ప్రమాదంలో పడింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‎గా రికార్డ్ సృష్టించాడు. సమీప భవిష్యత్ లో సచిన్ టెస్ట్ రికార్డ్స్ బ్రేక్ చేయగలడనే పేరున్న రూట్.. క్రికెట్ లో తన ఆల్ టైం గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరో చెప్పాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఇటీవల అనేక మంది ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లతో కూడిన 'దిస్ ఆర్ దట్' ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు.  

మోడ్రన్ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లలో ఒకరిగా పేరుగాంచిన రూట్.. ఈ ఛాలెంజ్ లో లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ను తన ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. తొలి రౌండ్‌లో రూట్ తనకంటే స్టీవ్ స్మిత్‌ను బెస్ట్ గా ఎంచుకున్నాడు. స్మిత్ టెస్ట్, వన్డేల్లో రూట్ కంటే కంటే తక్కువ పరుగులు చేసినా స్మిత్ కే ఓటేశాడు. తదుపరి రౌండ్‌లో స్మిత్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ లలో ఎవరు బెస్ట్ అని ఎంచుకోవాల్సి వస్తే పాంటింగ్ కు పేరు చెప్పాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ తో జరిగిన పోటీలో పాంటింగ్ ఓడిపోయాడు. 

ఛాలెంజ్ తరువాతి రౌండ్లలో.. అలిస్టర్ కుక్, కుమార్ సంగక్కర, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల కంటే జాక్వెస్ కల్లిస్‌ను బెస్ట్ అని రూట్  ఎంచుకున్నాడు. చివరి రౌండ్లో కల్లిస్ కంటే భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌ను రూట్ ఎంచుకున్నాడు. టెండూల్కర్ లేదా  విరాట్ కోహ్లీలలో ఎవరు ఆల్ టైం గెట్స్ అని ఎంచుకోమని అడిగితే కాసేపు అలోచించి టెండూల్కర్‌ను ఎంచుకున్నాడు. దీంతో “ఇది లేదా అది” ఛాలెంజ్ విజేతగా సచిన్ విజేతగా నిలిచాడు. 

ఇంటర్నేషనల్ క్రికెట్ లో వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. టెస్ట్ క్రికెట్ లో 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు చేసిన వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. మరోవైపు రూట్ 158 టెస్టుల్లో 13,543 పరుగులు చేసి టెండూల్కర్ ఆల్ టైం రికార్డుకు కేవలం 2,378 పరుగులు దూరంలో ఉన్నాడు. రూట్ మరో 2నుంచి 3 సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ లో కొనసాగితే టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.