Pawan Kalyan: 'OG' విధ్వంసం షురూ.. యూఎస్ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డుల సునామీ!

Pawan Kalyan: 'OG' విధ్వంసం షురూ.. యూఎస్ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డుల సునామీ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'ఓజీ'. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఒక మాఫియా కథాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలు పెంచుకుందో అర్థమవుతోంది. అటు బాక్సాఫీస్ వద్ద ఈ సారి గట్టినా కొట్టేస్తామని అభిమానులు అంటున్నారు.

అంచనాలకు మించి యూఎస్ వసూళ్లు

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, 'ఓజీ' యూఎస్ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ కేవలం 465 లొకేషన్లలో, 1990 షోల నుండి 1,668,982 డాలర్లు వసూలు చేసి అదరగొట్టింది. దీనితో నార్త్ అమెరికా మొత్తం ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ 1.83 మిలియన్ల డాలర్లకు చేరింది. ఇంకా కేవలం 6 రోజుల్లో ప్రీమియర్స్ ఉన్నప్పటికీ, సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ కలెక్షన్ల వర్షం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సాధారణంగా పెద్ద సినిమాల విడుదలకు కొన్ని రోజుల ముందు ట్రైలర్ విడుదలవుతుంది. కానీ 'ఓజీ' టీం వినూత్నంగా కేవలం కొన్ని విజువల్స్, పోస్టర్లతోనే ఈ స్థాయి పెంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు సెప్టెంబర్ 21న ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే వేగం కొనసాగితే, ట్రైలర్ వచ్చేలోపే 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

'ఓజీ' తారాగణం.. 

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన యువ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఇమ్రాన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం విశేషం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమన్ సంగీతం, పవన్ కల్యాణ్ మ్యానరిజమ్స్, సుజీత్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. 'ఓజీ' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 25 వరకు వేచి ఉండాల్సిందే.