
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కె -ర్యాంప్' విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటి యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన టీజర్, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
యూత్‌ను ఆకట్టుకునేలా టీజర్
'కె ర్యాంప్' టీజర్లో కిరణ్ అబ్బవరం స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. టీజర్ లో కొన్ని బూతులు, లిప్ కిస్‌లు యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి. కేరళ అందమైన లొకేషన్లలో సినిమాను షూట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా అంతా కామెడీ, యాక్షన్, రొమాన్స్ కలగలిపి ఉండనుందని టీజర్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో కిరణ్ సరసన యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, అతని నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత జోష్‌ను తీసుకొచ్చింది.
దీపావళి కానుకగా విడుదల
అక్టోబర్ 18న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ప్రేక్షకులకు 'హెవీ ఎంటర్‌టైన్‌మెంట్' ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. 'రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్' అంటూ వారు చేసిన ప్రకటన సినిమాపై ప్రేక్షకులలో ఉత్సుకత పెంచింది. ఈసారి 'కె ర్యాంప్'తో కిరణ్ అబ్బవరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.