దీపికా పదుకొణె అంటే ఇదే.. 'కల్కి 2898 AD' నటుడు సస్వత ఛటర్జీ వ్యాఖ్యలు వైరల్!

దీపికా పదుకొణె అంటే ఇదే.. 'కల్కి 2898 AD' నటుడు సస్వత ఛటర్జీ వ్యాఖ్యలు వైరల్!

సినీ నటి దీపికా పదుకొణె ఈ ఏడాది రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.  ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. వాటిల్లో ఒకటి సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'స్పిరిట్', కాగా రెండవది నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD'  సీక్వెల్ నుంచి ఈ బాలీవుడ్ భామ తప్పించారు. దీంతో ఈ బ్యూటీపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె వృత్తిపరంగా సరిగా వ్యవహరించడటం లేదంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.

'కల్కి' షూటింగ్‌లో అంకితభావం

అయితే ఆమెతో కలిసి పనిచేసిన నటులు, దర్శకులు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు.  కల్కి 2898 ADలో ఆమె సహనటుడు సస్వత ఛటర్జీ 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరో కోణాన్ని చూపించాయి. నేను హైదరాబాద్ స్టూడియోలో దీపికాతో ఒకరోజు షూట్ చేశాను. నేను ఉదయం 9 గంటలకు స్టూడియోకు వెళ్లాను. ఆమె షెడ్యూల్ 9.30 నుంచి. కానీ ఆమె మొదటి షాట్ సాయంత్రం 5 గంటలకు పడింది. అప్పటికే నేను దాదాపు పన్నెండు షాట్లు చేశాను అని సస్వత ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఉన్నప్పటికీ, ఆమె ఏమాత్రం విసుగు చెందకుండా, ముఖంపై చిరునవ్వుతో చాలా ఓపికగా ఎదురుచూసిందని ఆయన అన్నారు.

ALSO READ :  ‘బ్యూటీ’ రివ్యూ.. 

నేను లోపలికి వెళ్లడం, బయటికి రావడం చూసి, ఆమె నవ్వుతూ, మీకు మళ్లీ పిలుపు వచ్చింది.. నేను ఇంకా ఎదురుచూస్తున్నాను అని నాతో చెప్పింది అని సస్వత ఛటర్జీ తెలిపారు. ఇంత సుదీర్గ  సమయంలో కూడా ఆమె  చిరునవ్వుతో ఎదురుచూసింది. దీనినే ప్రొఫెషనలిజం అంటారు  అని ఆయన దీపికా అంకితభావాన్ని ప్రశంసించారు.  'కల్కి 2898 AD' చిత్రంలో దీపికా పదుకొణె, సస్వత ఛటర్జీతో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దిశా పటాని వంటి భారీ స్టార్ కాస్ట్ నటించారు. ఈ చిత్రం అద్భుతమైన గ్రాఫిక్స్, విస్తృతమైన అంతర్జాతీయ విడుదలలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లను రాబట్టింది..

అందుకే 'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి తొలగింపా?

గురువారం, 'కల్కి 2898 AD' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా దీపికాను సీక్వెల్ నుండి తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు వారి ఎరి ( X ఖాతాలో ) ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో భాగం కాబోరని అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి సినిమా కోసం కలిసి ప్రయాణించినప్పటికీ, మా మధ్య ఒక భాగస్వామ్యాన్ని కనుగొనలేకపోయాం. 'కల్కి 2898 AD' లాంటి సినిమాకు ఆ నిబద్ధత అవసరం. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము," అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 గొంతెమ్మ కోరికలు తీర్చలేక?. 

అయితే దీపికా పదుకొణెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడానికి గల కారణాలపై అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ..  అనేక  ఉహనానాలు తెరపైకి వస్తున్నారు.  మొదటి భాగానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 25 శాతం ఎక్కువ పారితోషికాన్ని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటానని పట్టుబట్టింది.  అంతే కాకుదు తన 25 మంది సిబ్బంది కోసం 5-స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె డిమాండ్ చేసిందనన్న టాక్ వినిపిపిస్తోంది. ఇలా ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక దీపికాను మూవీ మేకర్స్ పక్కన పెట్టినట్లు సమాచారం.

'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమణ

దీపికా పదుకొణె ఒక పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. గత మేలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రం నుంచి ఆమెను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రానికి ఆమె రూ. 20 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందని, 8 గంటల షిఫ్ట్, లాభాల్లో వాటా కోరిందంట. దీంతో ఆ చిత్ర నిర్మాతలు నటి త్రిప్తి డిమ్రిని కథానాయికగా ప్రకటించారు.

ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం వెనుక కారణాలు ఏమైనప్పటికీ, ఆమె భవిష్యత్తుపై మాత్రం ఈ ప్రభావం పడలేదు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో రానున్న చిత్రం 'AA22xA6'లో నటిస్తున్నారు.  ఇది ఆమె అల్లు అర్జున్‌తో మొదటి ప్రాజెక్ట్ కాగా, అట్లీతో రెండవ చిత్రం. ఈ పరిణామాలు సినిమా పరిశ్రమలో ఒక నటుడి వ్యక్తిగత డిమాండ్లు, వారి వృత్తిపరమైన అంకితభావంపై ఎంత చర్చ జరుగుతుందో స్పష్టం చేస్తున్నాయి.