
అదానీ షేర్ హోల్డర్ల పంట పండింది. హిడెంబర్గ్ నివేదిక అంతా తప్పు అని.. అదానీ సంస్థల్లో అసలు తప్పే జరగలేదని సెబీ ప్రకటన తర్వాత.. స్టాక్ మార్కెట్ లో అదానీ షేర్ల ధరల అమాంతం పెరిగింది. 2025, సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన వెంటనే.. అదానీ కంపెనీ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఏకంగా 10 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతుంది. దీంతో అదానీ కంపెనీల మార్కెట్ విలువ సైతం భారీగా పెరిగింది. అదానీ పవర్ కంపెనీ మార్కెట్ విలువ 14 వేల 900 కోట్ల రూపాయలు పెరిగింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ విలువ ఏకంగా 12 వేల 200 కోట్ల రూపాయలు పెరిగింది. అదే విధంగా అదానీ టోటల్ గ్యాస్ మార్కెట్ విలువ 6 వేల 500 కోట్ల రూపాయలు పెరిగింది.
స్టాక్ మార్కెట్ క్షీణత మధ్య భారతదేశంలో మూడవ అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన అదానీ గ్రూప్ షేర్లు ఈరోజు మంచి పెరుగుదలను చూశాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల స్టాక్ మానిప్యులేషన్ చేయడానికి అడికార్ప్, మైల్‌స్టోన్, రెహ్వర్ ద్వారా నిధులు మళ్లించిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తోసిపుచ్చడంతో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్ & సెజ్‌తో సహా అదానీ స్టాక్‌లు శుక్రవారం ట్రేడింగ్‌లో 9 శాతం వరకు పెరిగాయి. అయితే నిధుల సంబంధిత లావాదేవీలు ఉన్నప్పటికీ, వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉందని సెబీ గుర్తించింది.
దింతో అదానీ పవర్ షేర్స్ 8.53 శాతం పెరిగి రూ.684.70కి చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.2,521.35కి చేరుకుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేర్స్ 2.58 శాతం పెరిగి రూ.1,448.75కి చేరుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్స్ 4.47 శాతం పెరిగి రూ.1,022.70కి చేరుకుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్స్ 4.35 శాతం పెరిగి రూ.874.40కి చేరుకుంది. సిమెంట్ తయారీ కంపెనీలు ACC & అంబుజా సిమెంట్స్ షేర్స్ 1 శాతం పెరిగాయి. సంఘి ఇండస్ట్రీస్ షేర్స్ కూడా 1 శాతం పెరగగా, NDTV షేర్స్ 5 శాతం పెరిగి రూ.129.55కి చేరుకుంది.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ ఈ ఏడాది జనవరిలో తన టీంని రద్దు చేశారు. జనవరి 2023లో ఆయన విడుదల చేసిన అదానీ గ్రూప్ రిపోర్టుతో అదానీ సంస్థల మార్కెట్ విలువ $150 బిలియన్లు తగ్గిపోయింది. సెబీ నివేదికపై అదానీ స్పందిస్తూ ఈ తప్పుడు, ఉద్దేశపూర్వక రిపోర్ట్ వల్ల డబ్బు పోగొట్టుకున్న పెట్టుబడిదారుల బాధను మేం అర్థం చేసుకోగలం. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినవారు దేశానికి క్షమాపణ చెప్పాలి అని అన్నారు.
అదానీ గ్రూప్ ఎలాంటి తప్పు చేయలేదని సెబీ తేల్చి చెప్పింది. కొన్ని లావాదేవీలను సంబంధిత పార్టీ లావాదేవీలుగా పరిగణించలేదని, అందుకే సెబీ నిబంధనలు ఉల్లంఘించలేదని వెల్లడించింది. సెబీ చట్టంలోని సెక్షన్ 12A లేదా సెబీ (PFUTP) నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని తేలింది.
అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలు కొన్ని లావాదేవీలను దాచడానికి అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలను ఉపయోగించాయని ఆరోపణలు వచ్చాయి. నిధుల మల్లింపుపై సెబీ చేసిన పరిశోధనలో అదానీ పోర్ట్స్ సంస్థ అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్‌కు రుణాలు ఇచ్చినా, ఆ నిధులు అదానీ గ్రూప్ సంస్థలకు తిరిగి వెళ్ళినట్లు లేదా దుర్వినియోగం అయినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం షేర్ల పెరుగుదల గౌతమ్ అదానీ నికర విలువను 300కోట్లు పెంచింది.