సీఈఓ పదవి నుంచి తప్పుకున్న బఫెట్.. బెర్క్షైర్ హాతవే కొత్త సీఈఓ గ్రెగ్ ఏబెల్

సీఈఓ పదవి నుంచి తప్పుకున్న బఫెట్.. బెర్క్షైర్ హాతవే కొత్త సీఈఓ గ్రెగ్ ఏబెల్

న్యూఢిల్లీ: “ఒమాహా ఒరాకిల్(మార్గదర్శకుడి)”గా పాపులర్ అయిన సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వారెన్ బఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం తన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ  బెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్ హాతవే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన పెట్టుబడి విధానాలు  తరతరాల ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయి. లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంపద ఎలా సృష్టించుకోవాలో తెలియజేశాయి.  95 ఏళ్ల బఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించారు. 

దివాలా తీసిన టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ కంపెనీని బీమా, రైల్వేలు, ఎనర్జీ, వినియోగ వస్తువులు వంటి విభాగాల్లో వ్యాపారాలు కలిగిన గ్లోబల్ కాంగ్లోమెరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చారు.  నేడు ఈ సంస్థ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ, బఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన షేర్లలో పెద్ద భాగాన్ని హోల్డ్ చేస్తారు. వారసుడైన గ్రెగ్ ఏబెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనవరి నుంచి అధికారికంగా బాధ్యతలు చేపడతారు.

క్రమశిక్షణతోనే సంపద

బఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశాబ్దాలుగా లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్ పెట్టుబడులను క్రమశిక్షణతో జరిపారు. స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి దూరంగా ఉన్నారు. ఆయన కంపెనీల వాల్యూని గుర్తించి, తక్కువ వాల్యూయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్  చేసేవారు.  బఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్షిక షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్లకు రాసిన లేఖలు వాల్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యాయి.