కాగజ్ నగర్, వెలుగు: విద్యాశాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో అందుతున్న బోధన , సౌకర్యాలను ప్యానెల్ బృందం తనిఖీ చేసింది. బుధవారం కౌటాల మండలం ముత్యంపేట పరిధిలోని బారేవాడ, ముత్యంపేటలో బృందం తనిఖీలు నిర్వహించింది. విద్యాబోధన పద్ధతులను పరిశీలించారు.
తాగునీరు, మరుగుదొడ్లు, గదులు, ప్రహరీలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్యానల్ బృందం సభ్యులు శ్రీనివాస్, శివాజీ, శైలజ మాట్లాడుతూ అన్ని అంశాలపై నివేదిక రూపొందించి జిల్లా అధికారులకు అందిస్తామని తెలిపారు.
