స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు మారలే..

స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు మారలే..

న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (జనవరి 1 నుంచి మార్చి 31 వరకు)కు సంబంధించి స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ల వడ్డీ రేట్లను మార్చలేదు. అక్టోబర్ - డిసెంబర్, 2025 క్వార్టర్ కోసం నిర్ణయించిన రేట్లనే  కొనసాగించనుంది. దీంతో పోస్టాఫీస్‌‌‌‌లో లభించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ సీ)  వంటి స్కీమ్ ల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు.

వడ్డీ రేట్లు ఇలా.. 

    పీపీఎఫ్– 7.1 శాతం 
    సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) – 8.2 శాతం (అత్యధిక వడ్డీ రేటు)
    ఎన్ఎస్ సీ– 7.7 శాతం
    పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌‌‌‌కమ్ స్కీమ్ (పీఓఎంఐఎస్) – 7.4 శాతం
    కిసాన్ వికాస్ పత్ర – 7.5 శాతం