చంపాపేట్‌ నుంచి శంషాబాద్‌ వైపు పిక్నిక్‌కు వెళుతున్నప్రైవేట్ స్కూల్‌ బస్సులో మంటలు

చంపాపేట్‌ నుంచి శంషాబాద్‌ వైపు పిక్నిక్‌కు వెళుతున్నప్రైవేట్ స్కూల్‌ బస్సులో మంటలు

గండిపేట, వెలుగు: రన్నింగ్లో ఉన్న స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కృష్ణవేణి టాలెంట్ ​స్కూల్ ​విద్యార్థులు బుధవారం చంపాపేట్‌ నుంచి శంషాబాద్‌ వైపు పిక్నిక్‌కు వెళ్తున్నారు. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపి పిల్లలను కిందికి దించేశాడు. దీంతో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.