ఆర్మూర్, వెలుగు : పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాతే మున్సిపల్ ఫైనల్ ఓటర్ జాబితా ప్రకటించాలని బీజేపీ నాయకులు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రావణిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ మున్సిపల్చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ఆర్మూర్ లో ఓటర్ల విభజన, వార్డ్ ల విభజన సక్రమంగా లేదని, పెళ్ళైన వారి పేర్లు తొలగించేలేదని, కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో రాలేదని, ఓటర్ల జాబితా సవరణలు చేయాలని కోరారు.
బీఎల్వోలతో వెరిఫికేషన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, కార్యదర్శి పోల్కం వేణు, నాయకులు ఆకుల శీను, సుంకరి రంగన్న, జాగిర్ధర్ శీను, ఖాందేశ్ ప్రశాంత్, బాండ్లపల్లి నర్సారెడ్డి, పోచంపాటి శ్రీను, కుమార్, బాశెట్టి రాజ్ కుమార్, శేఖర్, ఉదయ గౌడ్ కుక్ నూరు లింగన్న, విజయానంద్, మిరియాల కిరణ్, చిట్టి బాజన్న తదితరులు పాల్గొన్నారు.
