తాగుడే తాగుడు.. 31 నైట్.. రూ.314 కోట్ల సేల్.. బీర్లు.. విస్కీలు.. ఏదైతేంది.. ఊదేశారు !

తాగుడే తాగుడు.. 31 నైట్.. రూ.314 కోట్ల సేల్.. బీర్లు.. విస్కీలు.. ఏదైతేంది.. ఊదేశారు !

హైదరాబాద్: తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఆల్ టైం రికార్డు సృష్టించాయి. న్యూ ఇయర్ కిక్కులో మద్యం ప్రియులు మునిగి తేలారు. డిసెంబర్ 31న ఒక్కరోజే రూ.314 కోట్ల లిక్కర్ సేల్ జరిగిందంటే.. ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

2025 డిసెంబర్ నెలలో చివరి 4 రోజుల్లో 12 వందల 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్తో పాటు ఎక్సైజ్ శాఖకు సర్పంచ్ ఎన్నికల కిక్కు కలిసొచ్చింది. 2025 డిసెంబర్ నెలలో 5 వేల 52 కోట్ల లిక్కర్ సేల్ అయింది. డిసెంబర్ నెలలో 49 లక్షల విస్కీ లిక్కర్ సేల్, 44 లక్షల కేసుల బీర్ సేల్స్ జరిగాయి.

రోజువారీగా వచ్చిన ఆదాయం
* డిసెంబర్ 31    రూ.400 కోట్లు
* డిసెంబర్ 30    రూ.375 కోట్లు
* డిసెంబర్​ 29    రూ.282 కోట్లు
* డిసెంబర్​ 28    రూ.182 కోట్లు

కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్‌‌‌‌లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది.. అదిరిపోయే కిక్‌‌తో ముగింపు పలికింది. అంతకు ముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్‌‌‌‌లో రూ.4,291 కోట్లు వచ్చాయి.​ 

డిసెంబర్​ చివరి నాలుగు రోజుల్లోనే లిక్కర్‌‌‌‌‌‌‌‌ సేల్స్​ జోరందుకున్నాయని, ఈ రోజుల్లోనే సుమారు రూ. 1,230 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ 27 నుంచి 31 రాత్రి వరకు వైన్ షాపులకు చేరిన మద్యం బాటిళ్ల విలువను చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.

క్షణం తీరిక లేకుండా కౌంటర్లు నడవడంతో కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత, మద్యంప్రియులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ ఆకాశాన్ని తాకాయి. 

28న రూ.182 కోట్లు, 29న రూ.282 కోట్లు, 30న రూ.375 కోట్లు, 31న రూ.400 కోట్ల పైచిలుకు విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాప్లకు చేరింది. ప్రభుత్వం అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలకు అనుమతులతోపాటు 31 రాత్రి ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్​ ఇవ్వడంతో సేల్స్ అమాంతం​ పెరిగాయి.