ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో
  • సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో

బోధన్, వెలుగు : బోధన్​ పట్ణణంలోని మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సబ్ కలెక్టర్​ వికాస్ మహతో అధికారులకు సూచించారు. బుధవారం బోధన్​ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల సంబంధిత పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. 

వార్డులు, పోలింగ్​ కేంద్రాలు, ఇంటినంబర్ల  వారీగా జాబితాలను సిద్ధం చేయాలన్నారు.  ఓటర్ల జాబితాల్లో తప్పులు ఉంటే సంబంధిత వార్డు ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్​ కృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.