కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న జీపీ పాలక వర్గం

కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న జీపీ పాలక వర్గం

ఎడపల్లి, వెలుగు :  మండల కేంద్రంలోని నయాబాదీలో కబ్జాకు గురైన గ్రామ పంచాయతీ స్థలాన్ని సర్పంచ్​ కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో బుధవారం జీపీ పాలక వర్గం స్వాధీనం చేసుకుంది. 2010 లో 285 గజాల స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయిస్తూ కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారని, కానీ అప్పటి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదని సర్పంచ్ తెలిపారు.

 బుధవారం కలెక్టర్​ ఉత్తర్వుల ప్రకారం గ్రామ పంచాయతీ సెక్రటరీతో కలిసి గ్రామ ఉపసర్పంచ్ గంగాధర్, వార్డు మెంబర్లు ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. ఇక నుండి ఈ స్థలంలోకి ఎవరైనా ప్రవేశిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.