- జిల్లా కమిటీలతో కాంగ్రెస్‌కు మరింత బలం
- టీపీసీసీ జనరల్సెక్రటరీ రహమతుల్లా హుస్సైన్
- క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్‌బాడీ సమావేశం
కోల్‌బెల్ట్, వెలుగు: పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కుతాయని, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పారదర్శకతతో జిల్లా పార్టీ పూర్తి కమిటీని ఎన్నుకుంటామని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అబ్జర్వర్, టీపీసీసీ జనరల్సెక్రటరీ రహమతుల్లా హుస్సేన్ అన్నారు. బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా కమిటీలను మరింత సమర్థంగా తీర్చిదిద్దడం, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచి పార్టీ నిర్మాణానికి బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, నూతన జిల్లా కమిటీల నియామకంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. 2029 పార్లమెంట్ ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
కొత్త కమిటీ ద్వారా మండల, బ్లాక్, గ్రామస్థాయి కమిటీలను పునరుద్ధరించి పార్టీ స్వరం ప్రతి మూలలో వినిపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు, ఎంపీ వంశీకృష్ణ చొరవతో పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఆదేశాలకు అనుగుణంగా జనవరి చివరలో జిల్లా కమిటీని ప్రకటిస్తామన్నారు.
పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్‌జిల్లా కార్యకవర్గంలో స్థానం కోసం ఆశావహులు దరఖాస్తులు అందజేశారు. మావేశంలో చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తులు పాల్గొన్నారు.
