పుతిన్‌‌ నివాసంపై దాడి వీడియో రిలీజ్

పుతిన్‌‌ నివాసంపై దాడి వీడియో రిలీజ్

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌ పుతిన్‌‌ ఇంటిపై ఉక్రెయిన్‌‌ డ్రోన్‌‌ దాడికి యత్నించింది. దీనికి సంబంధించిన వీడియోలను రష్యా డిఫెన్స్‌‌ మినిస్ట్రీ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో మంచులో కూలిపోయిన డ్రోన్‌‌ను చూపించారు. పుతిన్‌‌ నివాసం లక్ష్యంగా పక్కాగా ప్లాన్‌‌ చేసి డ్రోన్‌‌ దాడి చేశారని రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్రోవ్‌‌ వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉక్రెయిన్‌‌ నుంచి మొత్తం 91 డ్రోన్లు పుతిన్‌‌ నివాసం వాల్డాయ్‌‌ వైపు వచ్చాయని తెలిపారు. పుతిన్ నివాసానికి సగం దూరంలోనే అన్ని  డ్రోన్స్‌‌ను తాము అడ్డగించామన్నారు. 

బ్రయాన్స్క్‌‌, స్మోలెన్స్క్‌‌, ట్వెర్‌‌‌‌, నొవ్‌‌గోరోడ్‌‌ ప్రాంతాలను దాటుకొని చాలా డ్రోన్లు పుతిన్‌‌ నివాసం వైపు వచ్చాయని డిఫెన్స్‌‌ అధికారి తెలిపారు. బ్రయాన్స్క్‌‌, స్మోలెన్స్క్‌‌ ప్రాంతాల్లో 50 డ్రోన్ల ను అడ్డుకున్నామని చెప్పారు. నోవ్‌‌గోరోడ్‌‌ లో మరో 41 డ్రోన్లను కూల్చివేశామన్నారు. అయితే, రష్యా ఆరోపణలను ఉక్రెయిన్‌‌ తోసిపుచ్చింది. పుతిన్ ఇంటిపై దాడి చేశామనడం అబద్ధమని పేర్కొంది.