భార్య హత్య కేసులో జీవిత ఖైదు.. మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు

భార్య హత్య కేసులో జీవిత ఖైదు.. మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు

తూప్రాన్, వెలుగు: భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు, రూ. 10 వేల జరిమాన విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు జడ్జి నీలిమ బుధవారం తీర్పు ఇచ్చారు. తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపిన ప్రకారం.. తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన చంద్రం, నాగరాణి దంపతులకు 20 ఏండ్ల కింద పెండ్లి అయింది.  వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా, నాగరాణిపై భర్త పలుమార్లు దాడి చేశాడు. 

పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు. 2021 ఆగస్టులో భార్యను చంద్రం కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా.. వాదోపవాదాల తర్వాత నిందితుడు చంద్రంకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ  జడ్జి తీర్పు ఇచ్చినట్టు ఎస్ఐ తెలిపారు.