గ్రామాల అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్​(గుమ్మడిదల), వెలుగు: గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అవసరమైన నిధులు  కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని మొల్లగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో  రూ.10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న ప్రహరీ నిర్మాణ పనులకు, వీరారెడ్డి పల్లి నుంచి మొల్లగూడెం వరకు రూ.15 లక్షలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శుక్రవారం ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాల అమలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

అనంతరం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి జీఎస్​ఎన్​ ఫంక్షన్ హాల్ లో గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్​స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సొంత నిధులతో వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రారంభించారు.  అనంతరం విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో శారద, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఏజాజ్ అహ్మద్, సర్పంచ్​ దుర్గా నర్సింగ్​రావు,  విజయ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.