రైల్వేలో 312 ఖాళీ పోస్టులు.. 18 నుండి 40 ఏళ్ళు ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు..

రైల్వేలో 312 ఖాళీ పోస్టులు.. 18 నుండి 40 ఏళ్ళు ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీ కింద 312 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 29.

పోస్టుల సంఖ్య: 312.

ఖాళీల వివరాలు: చీఫ్ లా అసిస్టెంట్ (లెవల్ 7) 22, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లెవల్ 7) 07, జూనియర్ ట్రాన్స్​లేటర్ (హిందీ) (లెవల్ 6) 202, సీనియర్ పబ్లిక్ ఇన్​స్పెక్టర్ (లెవల్ 6) 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్​స్పెక్టర్ (లెవల్ 6), సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) (లెవల్ 6) 02, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ & మెటలార్జిస్ట్) (లెవల్ 2) 39, సైంటిఫిక్ సూపర్​వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) (లెవల్ 7) 01. 

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

వయోపరిమితి
కనీస వయసు: 18 ఏండ్లు.
గరిష్ట వయసు: 40 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 30.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు.) పీడబ్ల్యూబీడీ/ మహిళలు/ ట్రాన్స్​జెండర్/ ఎక్స్ సర్వీస్ మన్/ ఎస్సీ/ ఎస్టీ/ మైనార్టీ/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మొత్తం నగదును తిరిగి చెల్లిస్తారు.) 

లాస్ట్ డేట్: 2026, జనవరి 31.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రాన్స్​లేషన్ టెస్ట్ (జూనియర్ ట్రాన్స్​లేటర్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు.  100 ప్రశ్నలను 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

పూర్తి వివరాలకు rrbsecunderabad.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.