ఫోర్బ్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెరిగిన యంగ్ బిలియనీర్లు

ఫోర్బ్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెరిగిన యంగ్ బిలియనీర్లు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భారీగా విస్తరించడంతో  39 ఏళ్ల లోపు స్వయంగా సంపాదించిన బిలియనీర్ల సంఖ్య మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. డిసెంబర్ నాటికి ‘ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ 40  అండర్ 40’ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో  71 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో భారతీయులు, భారతీయ మూలాలు ఉన్నవారు  కూడా చోటు దక్కించుకున్నారు.  

అమెరికాలో స్థిరపడిన అంకూర్ జైన్ (బిల్ట్‌‌‌‌‌‌‌‌ రివార్డ్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ) 3.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో 19వ స్థానంలో  నిలిచారు. భారత్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏకైక ప్రతినిధి నిఖిల్ కామత్ (జెరోధా ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 3.3 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు. అదేవిధంగా, భారత మూలాలున్న మెర్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐ రిక్రూటింగ్ స్టార్టప్ ఫౌండర్లు సూర్య మిధా, ఆదర్శ హిరేమత్  చెరో 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 27వ స్థానంలో ఉన్నారు.  కొత్త తరహా సంపద సృష్టిలో ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్, రివార్డ్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఫోర్బ్స్ పేర్కొంది.