
శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్ తో ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ సమయంలో చేసిన పని వైరల్ అవుతుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ లో సూర్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో రవిశాస్త్రి జట్టులోని మార్పుల గురించి అడిగాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన సూర్య.. ఎవరు ప్లేయింగ్ 11 లోకి వచ్చారో చెప్పలేకపోయారు. హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడని చెప్పిన ఇండియన్ కెప్టెన్.. ఇంకో మార్పు చెప్పలేకపోయాడు.
టాస్ టైంలో ఎంతలా ఆలోచించినా హర్షిత్ రానాతో పాటు ఎవరు జట్టులోకి వచ్చారో చెప్పలేక తెగ కష్టపడిపోయాడు. ఈ క్రమంలో చాలా సార్లు ఆలోచించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు రోహిత్ శర్మతో తనను పోల్చుకొని నవ్వుకున్నాడు. సూర్య సమాధానంతో స్టేడియంలోని ఫ్యాన్స్ తో పాటు రవిశాస్త్రి తెగ నవ్వుకున్నారు. సహజంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మర్చిపోతాడనే పేరుంది. కానీ సూర్య కూడా తన మతిమరుపుతో హిట్ మ్యాన్ ను గుర్తు చేశాడు. సూర్య చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరంగా ఒమన్ కెప్టెన్ జితిందర్ సింగ్ కూడా తమ జట్టులోని రెండు మార్పులు చెప్పలేకపోయాడు.
నామమాత్రంగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి స్థానంలో అర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు ఒమాన్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. సూపర్-4 కోసం బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు రెస్ట్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్ ల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓమన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఇండియాకు సరైన బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించలేదు. ఈ కారణంగానే సూర్య బ్యాటింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
"I have become like Rohit"
— GURMEET GILL 𝕏 (@GURmeetG9) September 19, 2025
- 😂😂
Suryakumar Yadav forget the two changes for India vs Oman during toss. pic.twitter.com/GHXuw0N9vj