మెదక్ లో గ్యాస్ ఏజెన్సీ దగ్గర బారులు తీరిన సిలిండర్లు.. అసలేమైందంటే.. ?

మెదక్ లో గ్యాస్ ఏజెన్సీ దగ్గర బారులు తీరిన సిలిండర్లు.. అసలేమైందంటే.. ?

మెదక్ పట్టణంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఖాళీ సిలిండర్లు బారులు తీరాయి.. గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చే జనాలు ఉంటారు, లేదంటే గ్యాస్ సిలిండర్ టైంకి రాకపోయినా, గ్యాస్ సప్లైలో ఏదైనా తేడా జరిగితే కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చే జనాలు ఉండాలి కానీ.. సిలిండర్లు బారులు తీరడం ఏంటి అనుకుంటున్నారా..?  ఏమైందంటే.. మెదక్ పట్టణంలో భారత్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. అందుకే శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్లు క్యూలైన్లో పెట్టి ఏజెన్సీ దగ్గర బారులు తీరారు కస్టమర్లు. 

హైదరాబాద్ లోని చర్లపల్లి దగ్గర ట్రాన్స్పోర్ట్ లారీలు ధర్నా చేస్తుండడంతో గత రెండు రోజుల నుంచి మెదక్ పట్టణంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీ దగ్గర బారులు తీరారు జనం.దసరా బతుకమ్మ పండగ సీజన్ కాబట్టి త్వరితగతిన లారీల సమస్యను తీర్చి గ్యాస్ సిలిండర్లను అందించాలని గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ లకు విజ్ఞప్తి చేశారు కస్టమర్లు.

ఈ విషయంపై భారత్ గ్యాస్ ఏజెన్సీ స్పందించిన మేనేజర్ వెంకటరెడ్డి.. ఇప్పటివరకు స్టాక్ ఉన్న గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయడం జరిగిందనీ.. రెండు రోజులగా హైదరాబాద్ నుంచి సరఫరా కాకపోవడం తో లబ్ధిదారులకు అందించలేకపోయామని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కర్నూల్ నుంచి ఒక లోడు గ్యాస్ సిలిండర్ పంపిస్తున్నట్టు చెప్పారు. అది రాగానే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు ఏజెన్సీ మేనేజర్.