Nag Ashwin: ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందే.. దీపికాకు నాగ్ అశ్విన్ కౌంటర్..వైరల్ అవుతున్న పోస్ట్

Nag Ashwin: ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందే.. దీపికాకు నాగ్ అశ్విన్ కౌంటర్..వైరల్ అవుతున్న పోస్ట్

కల్కి2 నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. నిన్న మేకర్స్ (సెప్టెంబర్ 18న) అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచి, ఈ ఇష్యుపై మాట్లాడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ మరింత అలజడి క్రియేట్ చేస్తుంది. ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ మరింత చర్చనీయాంశంగా మారింది. 

‘కల్కి 2898 AD’లోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ వీడియోను పోస్ట్ చేస్తూ, ఆలోచింపజేసే క్యాప్షన్ పెట్టాడు. ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వ‌త్థామకు కృష్ణుడు చెప్పే డైలాగు షేర్ చేశారు. ‘‘జరిగిపోయిన దానిని మీరు మార్చలేరు.. కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’’ అని నాగ్ అశ్విన్ రాసుకొచ్చారు. ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలో దీపికా తప్పుకోవడంతోనే నాగ్ అశ్విన్ ఇన్ డైరెక్ట్గా కౌంటర్ వేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘దీపికాపై నాగ్ అశ్విన్ బాగా కోపంగా ఉన్నాడని ఒకరంటే.. ఇలా ఇన్ డైరెక్ట్గా కోడ్ భాషల్లో మాట్లాడేదాన్ని కంటే.. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

అయితే, కల్కి సీక్వెల్లో దీపికా నటించడానికి భారీ కండిషన్స్ పెట్టిందట. కల్కి పార్ట్ 1 కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతోపాటుగా మరికొన్ని విస్తుతపోయే కండిషన్స్ పెట్టినట్లు సినీ వర్గాల సమాచారం.  

గురువారం (సెప్టెంబర్ 18న).. ‘కల్కి 2898 AD’ మేకర్స్ (వైజయంతి ప్రొడక్షన్ హౌస్) దీపికా తప్పుకున్నట్లు X వేదికగా పోస్ట్ చేశారు. ‘‘జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ కల్కిలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, రెండో పార్ట్‌లో (Kalki 2) భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్‌ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతీ మూవీస్‌ తెలిపింది. 

ఏదేమైనా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా దీపికను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే కలిగింది. ఇక ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో నటిస్తుంది. అలాగే, షారుఖ్ ‘కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో పాటు సంజయ్ లీలా భన్సాలి ‘లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాల్లో నటిస్తోంది.

ఆమెకు బదులు ఎవరెంటే?

కల్కిలో సుమతి పాత్రలో దీపికా నటించింది. ఇపుడు ఆ క్యారెక్టర్లో ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్‌ను లేదా సూపర్ వుమెన్ లోకాతో భారీ హిట్ కొట్టిన కల్యాణి ప్రియదర్శన్‌ ను తీసుకోవాలని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే, మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్న బాగుంటుందని నాగ్ అశ్విన్ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.