ఓ న్యూస్ ఆర్టికల్ స్ఫూరితో.. నితిన్ ‘తమ్ముడు’ కథ: డైరెక్టర్ వేణు శ్రీరామ్

ఓ న్యూస్ ఆర్టికల్ స్ఫూరితో.. నితిన్ ‘తమ్ముడు’ కథ: డైరెక్టర్ వేణు శ్రీరామ్

‘వకీల్ సాబ్’ తర్వాత  శ్రీరామ్ వేణు రూపొందించిన చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్​  నిర్మించిన ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పిన విశేషాలు. 

‘‘ఓ న్యూస్ ఆర్టికల్ స్ఫూరితో  ‘తమ్ముడు’కథను సిద్ధం చేసుకున్నా. హీరోతో పాటు ఐదుగురు ఉమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. ఈ చిత్రంతో లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌‌‌‌లతో పాటు మా అమ్మాయి దిత్య పాత్రల చుట్టూనే ఈ సినిమా ఉంటుంది.

బ్రదర్ అండ్  సిస్టర్ సెంటిమెంట్‌‌‌‌ ప్రధానంగా ఉన్న ఈ  కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇందులో నితిన్ ఆర్చర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తాడు. దీనికోసం ఆయన పదిహేను రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. మిగతా స్పోర్ట్స్ కంటే ఆర్చరీకి మెంటల్‌‌‌‌గా, ఫిజికల్‌‌‌‌గా చాలా స్ట్రాంగ్‌‌‌‌గా, ఏకాగ్రతతో ఉండాలి.

గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. విలువిద్య చాలా పురాతనమైనది, రాముడు, అర్జునుడి కాలం నుంచీ చూస్తున్నాం. నితిన్ కూడా అద్భుతమైన  పర్ఫార్మెన్స్‌‌‌‌ చేశాడు.

ఇందులోని  ఫైట్ సీక్వెన్సులు  మంచి ఇంపాక్ట్ ఉంటాయి. ‘విక్రమ్’లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో మా మూవీలోనూ హీరో పాత్ర అలాగే  ఉంటుంది.

అజనీష్ లోకనాథ్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఫ్రెష్​ ఫీల్‌‌‌‌ని ఇస్తుంది.  బడ్జెట్, క్రియేటివ్ పరంగా దిల్ రాజు గారు ఈ మూవీ బాధ్యత మొత్తం నాకే అప్పగించారు. ఇప్పటివరకు జానర్ రిపీట్ చేయకుండా సినిమాలు చేశాను.

అయితే నా ప్రతి స్క్రిప్ట్‌ లోనూ ఫీమేల్ క్యారెక్టర్స్‌‌‌‌కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇందులోనూ అలా కుదిరింది.  ఫ్యామిలీస్‌‌‌‌ నచ్చే అంశాలతో పాటు మాస్‌‌‌‌ను మెప్పించే యాక్షన్ సీక్వెన్సులు ఇందులో ఉన్నాయి.  అలాగే కొత్త తరహా స్ర్కీన్‌‌‌‌ప్లేతో ఆకట్టుకుంటుంది’’.