
పద్మారావునగర్, వెలుగు: ఐఏఎస్ అరవింద్ కుమార్, శివ బాల కృష్ణపై మరో అవినీతి కేసు నమోదైంది. గతంలో హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్, ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన శివ బాల కృష్ణ పుప్పలగూడ సర్వే నంబరు 277, 280, 281లో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ డీఎస్ఆర్ఎస్ఎస్ఐ అనే సంస్థకు హై రైస్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చి- వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలో - న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ లోకాయుక్త విచారణ చేయనుంది.