
హైదరాబాద్ సిటీలో జోరుగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లనుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ సిటీలో అన్ని ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన పోలీసుల రైడింగ్ లో చాలా చోట్ల పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తాజాగా సిటీ పరిధిలోని కూకట్ పల్లిలోభారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం (సెప్టెంబర్19) పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కూకట్ పల్లి జంక్షన్ లో ఎస్ వోటీ పోలీసుల తనిఖీల్లో నిర్వహిస్తుండగా మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులో దర్జాగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర 22.5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు ఎస్ వోటీ పోలీసులు.