
హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం (సెప్టెంబర్19) ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. 44 సూపర్ మార్కెట్లతో తనిఖీలు చేసిన అధికారులు.. శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపారు. పలు సూపర్ మార్కెట్లతో వెజ్, నాన్ వెజ్ ప్రాడక్టులు ఒకేచోట నిల్వ చేసినట్లు గుర్తించారు. ఫుడ్ స్టోర్లలో ఈగలు, దోమలు మూగి దుర్గంధం వస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సూపర్ మార్కెట్లకు నోటీసులు జారీ చేశారు.
సైదాబాద్ మోర్ మార్కెట్లో కాలం చెల్లిన కుళ్లిన యాపిల్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. కాచిగూడ రిలయన్స్ రిటైల్ లో గడువు ముగిసిన ఇంపోర్టెడ్ అవకాడో, ఆరెంజెస్ అమ్ముతున్నట్టు తనిఖీలో బయటపడింది.
కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ లో గడువు ముగిసిన పాలక్ రైస్ పాపడ్, థిక్ షేక్ లు విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కొండాపూర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ లో , కేపీఎణ్ పార్మ్ ఫ్రెష్ లో గడువు ముగిసిన ప్రాడక్టుుల అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.