వనస్థలిపురం గేటెడ్ కమ్యూనిటీలో పొద్దుపొద్దునే దొంగల బీభత్సం .. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారు చైన్లు చోరీ

వనస్థలిపురం గేటెడ్ కమ్యూనిటీలో పొద్దుపొద్దునే  దొంగల బీభత్సం .. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారు చైన్లు చోరీ

హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.  పగలు రాత్రి అనే తేడా లేకుండా చోరీకి పాల్పడుతున్నారు. శివారు ఇండ్లను టార్గెట్ గా చేసుకుంని..ఇంట్లో, రోడ్లపై  ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ గా దోపిడి చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి కత్తులతో బెదరిస్తున్నారు. 

లేటెస్ట్ గా వనస్థలిపురంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడి జరగడం కలకల రేపుతోంది.  సెక్యూరిటీ..చాలా మంది జనం ఉండగా.. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు కళ్లల్లో కారం కొట్టి.. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అసలు దొంగలు ఎలా వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ హాల్ లో న్న రామాసుందరి(73) అనే వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త నిరంజన్(77) మార్కింగ్ వాక్ కు వెళ్లారు.  ఇదే అదనుగా తీసుకున్న  ఓ మహిళ ఇంట్లోకి చొరబడి మహిళ కళ్లల్లో  కారం చల్లి ,చెయ్యి కొరికి బంగారు నగలు ఎత్తుకెళ్లింది . ఆరు తులాల రెండు బంగారు చైన్ లను లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.

 బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇంత పగడ్బంధీ భద్రత ఉన్నా.. చోరీ జరగడంపై ఆరా దీస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు  కాలనీవాసులు.