HHVM: బాబీడియోల్ క్యారెక్టర్పై.. దర్శకుడు జ్యోతి కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

HHVM: బాబీడియోల్ క్యారెక్టర్పై.. దర్శకుడు జ్యోతి కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు బాబీ డియోల్. తను కీలక పాత్ర పోషించిన చిత్రాల్లో ఒకటి ‘హరిహర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ ఈ సినిమాను రూపొందించాడు. ఏఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు నిర్మించారు.

జులై 24న సినిమా విడుదల కానున్న సందర్భంగా బాబీ డియోల్ పాత్ర గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ  కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇందులో ఆయన మొఘల్ చక్రవర్తి  ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడని, తన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా, హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని అన్నాడు.

నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సినిమా ప్రారంభంలోనే చిత్రీకరించామని, కానీ, ‘యానిమల్‌‌‌‌’లో తన పాత్రకు డైలాగ్స్ లేకపోయినా, హావభావాల ద్వారానే ఎమోషన్స్‌‌‌‌ను చూపించిన బాబీ టాలెంట్ తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే  తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా డిజైన్ చేశానని చెప్పాడు. ఆయనతో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను ఇచ్చిందని జ్యోతికృష్ణ తెలియజేశాడు.