ఉప్పల్‌‌లో మాంగళ్య ఎగ్జిబిషన్ సేల్‌‌ ప్రారంభం

ఉప్పల్‌‌లో మాంగళ్య  ఎగ్జిబిషన్ సేల్‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ‘మాంగళ్య షాపింగ్ మాల్’ గురువారం ఉప్పల్‌‌లో ఎగ్జిబిషన్ సేల్‌‌ను ప్రారంభించింది. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై, దీపప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ సేల్‌‌ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్‌‌కు తొలి రోజు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. 

ప్రారంభోత్సవ అనంతరం యాంకర్ రష్మి మాట్లాడుతూ.. మాంగళ్య షాపింగ్ మాల్‌‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. వారి ఆశీర్వాదాలతో మాల్ మరింత విజయవంతమవుతుందని ఆశా భవం వ్యక్తం చేశారు. డైరెక్టర్లు మాట్లాడుతూ.. మాంగళ్య షాపింగ్ మాల్‌‌లో రూ.99 నుంచి రూ.1 లక్ష వరకు ధరల శ్రేణిలో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ఫ్యాషన్ కలెక్షన్స్, వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.