
ఎల్బీనగర్ , వెలుగు: నిరుద్యోగ భృతి పేరుతో సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మహేశ్వరం సెగ్మెంట్ బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు మండిపడ్డారు. ఇంటింటికి పాదయాత్రలో భాగంగా బుధవారం ఆర్కేపురం డివిజన్లోని పలు కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.
ALSO READ:బీజేవైఎం నేతలపై మైనంపల్లి అనుచరుల దాడి
ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. పాదయాత్రలో జనాల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోందన్నారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆర్కేపురంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను అందెల శ్రీరాములు దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.