మన స్కూళ్లు , కాలేజీల్ని కబ్జా చేస్తున్న ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు

మన స్కూళ్లు , కాలేజీల్ని కబ్జా చేస్తున్న ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు

లాక్డౌన్ టైంలో అంతా ఇండ్లకే పరిమితమైతే ఆంధ్రా కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంస్థలు మాత్రం మన రాష్ట్రంలో చాపకింద నీరులా చొచ్చుకొచ్చి దందా మొదలుపెట్టాయి. గెస్ట్ హౌస్లలో ఆఫీసులు తీసుకొని.. కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకొని.. చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్లను, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలను అగ్గువసగ్గువకు కొనేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రా కార్పొరేట్ సంస్థ కబ్జా కోరల్లో వరంగల్, కరీంనగర్ , ఖమ్మం, నిజామాబాద్ లోని పలు స్కూళ్లు , కాలేజీలు చిక్కుకున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి పలు పెద్ద పెద్ద ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు మన జిల్లాల్లోకి విస్తరిస్తున్నాయి.

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో లోకల్ విద్యా సంస్థ లను వీక్ చేసేందుకు ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు ప్లాన్ చేస్తున్నా యి. గుట్టుచప్పుడు కాకుండా జిల్లాల్లోకి ఎంటర్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో అడ్మిషన్లులేక నష్టాల్లో ఉన్న ప్రైవేటు స్కూళ్లను  ప్రైవేటు ఇంటర్ కాలేజీలను ఎంపిక చేసుకొని.. వాటి నిర్వాహకులతో బేరాలు కుదుర్చు కుంటున్నాయి. పెద్దమొత్తంలో డబ్బులు ఆశ చూపి ఆ స్కూళ్లల్లో, ఆ కాలేజీల్లో వాటాలను కొంటున్నాయి.

కొన్నిచోట్ల స్కూళ్లను ,కాలేజీలనే కొనేస్తున్నాయి. పేరుకు మాత్రం స్కూల్లకు, కాలేజీలకు పాత పేర్లే ఉంటాయి. మేనేజ్మెంట్ అంతా ఆంధ్రా కార్పొరేట్ సంస్థ లదే. ఈ అకడమిక్ ఇయర్ లో వరంగల్ లో దాదాపు 10 ప్రైవేటు స్కూళ్లు, 2 ఇంటర్ కాలేజీలు.. కరీంనగర్ లో రెండు ప్రైవేటు స్కూళ్లు, ఒక ఇంటర్ కాలేజీ.. నిజా మాబాద్ లో 4 ప్రైవేటు స్కూళ్లు, 2 ఇంటర్ కాలేజీల్లో ఆంధ్రా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తమ యాక్టివిటీస్ స్టార్ చేసేందుకు రెడీ అయ్యాయ

ఏపీలో కట్టడి..ఇక్కడ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేటు విద్యా సంస్థలను అక్కడి ప్రభుత్వం కట్డడి చేసింది. 2020-–21 అకడమిక్ ఇయర్ లో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్స్ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సిందే. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. దీంతో ఏపీలోని కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంస్థలు తెలంగాణలోని జిల్లా కేంద్రాలపై దృష్టిపెట్టాయి. ఇక్కడి కొందరు నేతల అండతో ఇంటర్ కాలేజీలతోపాటు స్కూళ్లను టేకోవర్ చేసే పనిలో పడ్డాయి. ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు?

లాక్ డౌన్ టైంలో అన్ని సంస్థలు తమ కార్యకలాపాలను బంద్ చేసుకున్నాయి. కానీ ఆంధ్రా కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం వరంగల్ వంటి ప్రాంతాల్లో యాక్టివిటీ కొనసాగించాయి. టూరిజం గెస్ట్ హౌస్  లో ఆఫీసు తీసుకొని.. ఇద్దరు ముగ్గురు టెలి కాలర్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. పిల్లలు, పేరెంట్స్ కు ఈ టెలీకాలర్స్ ఫోన్లుచేస్తూ.. ‘‘మీ ఏరియాలో మా బ్రాంచి  ఓపెన్ చేసినం అన్ని పర్మిషన్లున్నాయి. మీ పిల్లలకు మా దగ్గర ఎంత జల్దిన అడ్మిష్లను తీసుకుంటే అంత ఫాయిదా” అంటూ గాలం వేస్తున్నారు. దీంతో ఆ స్కూళ్లల్లో తమ పిల్ల లను చేర్పించేందుకు పేరెంట్స్ రెడీ అవుతున్నారు.

 కొందరు అధికారపార్టీ నేతల అండ

అధికార పార్టీ నేతల సహకారంతోనే ఆంధ్రా కార్పొ రేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు జిల్లాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ కాలు పెట్టేం దుకు జంకిన ఆ సంస్థలు ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఎలా వస్తున్నా యని లోకల్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ లు చర్చించుకుంటున్నాయి.  దీని వెనుక కొందరు అధికార పార్టీ నేతల అండదండలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఆంధ్రా కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలు తెలిసి స్థానిక ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు, స్టూడెంట్స్ యూనియన్లకు ఫిర్యాదులు కూడా చేశాయి.

 ఆందోళనలో చిన్న స్కూళ్లు,కాలేజీలు

నష్టాల్లో ఉన్న స్కూళ్లను, కాలేజీలను కొనేస్తూ వాటిలో ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు కార్యకలాపా లు స్టార్ట్చేస్తుండటంతో లోకల్ స్కూళ్లు, కాలేజీల మేనేజ్మెంట్లు ఆందోళన చెందుతున్నాయి. వాటి ప్రభావంతో లోకల్ స్కూళ్లు, కాలేజీలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నాయి. ఇలా ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు లోకల్ స్కూళ్లను, కాలేజీలను టేక్ఓవర్ చేసుకుంటూ పోతే.. స్వయం ఉపాధికో సం ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లను నడుపుకుంటున్న తమ పరిస్థితి ఏమిటని రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా కార్పొరేట్ సంస్థ లను ప్రభుత్వం కట్టడి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సొంత రాష్ట్రంలో ఆంధ్రా విద్యా సంస్థలకు ఎలా అనుమతిస్తారు? ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా ? వాటిని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? చిన్న చిన్న విద్యాసంస్థలు ఏం కావాలి ? ఆంధ్రా సంస్థలు విస్తరిస్తే స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న స్కూల్స్ భవిష్యత్ ఏంటి..? – సతీష్ కుమార్ , వరంగల్ జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆర్గ నైజింగ్ సెక్రటరీ.