డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ కి హైకోర్టు అనుమతి

డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ కి హైకోర్టు అనుమతి

వైజాగ్ డాక్టర్ సుధాకర్‌  మానసిక వైద్య శాల నుంచి  డిశ్చార్జికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే సీబీఐ విచారణకు సహకరించాలని ఆయనకు సూచించింది. ఆస్పత్రి సూపరిండెంట్ ను తెలియజేసి ఏ క్షణమైనా డిశ్చార్జ్ కావచ్చునని హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది.

కరోనాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు సౌకర్యాలు కల్పించడంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరో కేసులో సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేసి ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ మానసిక చికిత్సాలయానికి తరలించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి..కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నర్సీపట్నం చేరుకుని మున్సిపల్ కమిషనర్ ను విచారించారు. అంతకు ముందు సుధాకర్ పని చేస్తున్న ఆస్పత్రికి వెళ్లి సుపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే హాజరు పట్టీ పరిశీలించారు.