నదుల అనుసంధానంపై రేపు కేసీఆర్, జగన్ భేటీ

నదుల అనుసంధానంపై రేపు కేసీఆర్, జగన్ భేటీ

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మరోసారి భేటీ అవుతున్నారు. ముందుగా ఎల్లుండి భేటీ కావాలనుకున్న సీఎంలు,.. ఒకరోజు ముందే కలుస్తున్నారు. గోదావరి నీళ్ల తరలింపుపై కేసీఆర్, జగన్ ఇప్పటికే ఒకసారి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు గోదావరి-కృష్ణా అనుసంధానంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు సీఎంలు. దీనిపై గ్రౌండ్ వర్క్ చేసిన అధికారులు ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై రేపు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు సమాచారం.