చంద్రబాబు రాయలసీమ గొంతు కోశాడు: విద్యార్థి జేఏసీ

చంద్రబాబు రాయలసీమ గొంతు కోశాడు: విద్యార్థి జేఏసీ

కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్ర బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకోడంతో తోపులాట జరిగింది. చంద్ర బాబు రాయలసీమ ద్రోహిఅని..రాయలసీమ గొంతు కోశాడని అన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. టీడీపీ రాజకీయ సమాది రాయలసీమలోనేనని చంద్ర బాబు కాన్వాయ్ కు ఎదురెళ్లారు. దీంతో వారిని కర్నూలు 2,3 టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

రాయలసీమలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని మూడు నెలలుగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ… అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారని అన్నారు.  ఏకపక్షంగా కోస్తాంధ్రలో రాజధాని, హైకోర్టు, విద్య, వైద్య, IT హబ్ లాంటివన్నింటిని అక్కడే ఏర్పాటు చేశారని చెప్పారు.

రాయలసీమ లో 52 MLAలకు గాను కేవలం 3 మాత్రమే TDP గెలిచిందని..  8MP సీట్లకు ఒక్కటి కూడా గెలవలేదని.. ఇప్పటికైనా చంద్ర బాబు సమీక్షించుకోవాలని చెప్పారు. రాయలసీమలో రాజధానిని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేలా  అనుకూల ప్రకటన చేయాలని అన్నారు. లేని పక్షంలో రాయలసీమలో TDP రాజకీయ సమాధి తప్పదని నేతలు హెచ్చరించారు.