దర్శకధీరుడు ఎస్.ఎస్ రామౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషల్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29' (వర్కింగ్ టైటిల్: 'గ్లోబ్ ట్రాటర్') భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీకి సంబంధిచిన వివరాలు బయటకు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 15న 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించి సర్ ప్రైజు ఇచ్చారు రాజమౌళి. లేటెస్ట్ గా మరో మరో సడెన్ సర్ ప్రైజు ఇచ్చి అభిమానులను మరింత ఉత్సాహంలో నింపారు. దీంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
'గ్లోబ్ ట్రాటర్' మెగా ఈవెంట్..
ఈ 'SSMB29' సినిమాకు సంబంధించి కీలక ప్రకటన, టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు ఈనెల 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరుతో జియో సినిమా/హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మహేశ్ బాబు స్వయంగా వీడియో బైట్‌తో ప్రకటించి అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఈ వేదికపై మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణం పాల్గొనబోతోంది.
విలన్‌గా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ సంచలనం..
సడెన్ సర్‌ప్రైజ్‌లలో భాగంగా, ఇటీవల సినిమాలోని విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు. 'కుంభ' అనే క్రూరమైన, శక్తివంతమైన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. వీల్ చైర్‌లో, రోబోటిక్ చేతులతో ఉన్న ఆ మెకానికల్ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'డాక్టర్ ఆక్టోపస్' లాంటి కామిక్ బుక్ విలన్‌ను గుర్తుకుతెచ్చే ఈ పాత్ర... విభిన్నమైన విలనిజం చూపిస్తుందని రాజమౌళి వెల్లడించారు.
శ్రుతి హాసన్ గళంలో 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్..
అంతలోనే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిని ప్రముఖ నటి, గాయని శ్రుతి హాసన్ ఆలపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. 'సంచారి.. సంచారి' అంటూ సాగే ఈ పాట లిరిక్స్, మహేశ్ బాబు పోషించనున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచరర్ పాత్ర స్వభావాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ పాటను సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే కేవలం ప్రచార గీతమా అనేది తెలియాల్సి ఉంది.
ఈ పాటపై శ్రుతి హాసన్ స్పందిస్తూ... కీరవాణి గారి మ్యూజికల్‌కి పాడటం చాలా ఆనందంగా ఉంది. ఎంత పవర్ఫుల్ ట్రాక్! 'గ్లోబ్ ట్రాటర్' ప్రపంచాన్ని అది షేక్ చేయాలి. ముందుగా విఘ్నేశ్వర మంత్రంతో ఆయన సెషన్‌ను ప్రారంభిస్తారనుకున్నాను. కానీ, సడెన్‌గా ఈ పాట మూమెంట్ చాలా స్పెషల్ నిలిచింది.. మీ దయకు, టీమ్ ప్రేమకు ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
'బాహుబలి', 'RRR' వంటి విజువల్ వండర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, మహేశ్ బాబుతో కలిసి చేయబోతున్న ఈ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియానా జోన్స్ తరహా పాత్రలో మహేశ్ కనిపించనున్నారనే వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
