ప్రీ వెడ్డింగ్ షూట్లో కనిపించిన ఈ ప్రేమ.. పెళ్లైన 8 నెలలకు ఎటు పోయిందో.. RIP బ్రో..!

ప్రీ వెడ్డింగ్ షూట్లో కనిపించిన ఈ ప్రేమ.. పెళ్లైన 8 నెలలకు ఎటు పోయిందో.. RIP బ్రో..!

బెంగళూరు: కర్నాటక రాజధాని నగరం బెంగళూరులో భార్య వేధింపులు భరించలేక బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. బెంగళూరులోని గిరినగర్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎనిమిది నెలల క్రితం గగన్కు, మేఘనకు వివాహమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయినప్పటికీ పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ఇద్దరూ కాల్స్ మాట్లాడుకుంటూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ముచ్చట కూడా తీరింది. ఇద్దరూ ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మేఘన, గగన్ పెళ్లి జరిగింది. 

గగన్ బెంగళూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తుండటంతో బెంగళూరులోని గిరినగర్లో ఈ కొత్త జంట కాపురం పెట్టింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ.. నెలలు గడిచే కొద్దీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. పెళ్లి నాటి ప్రమాణాలను ఇద్దరూ మర్చిపోయారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుండేవారని ఇరుగుపొరుగు చెప్పారు. ఇంట్లో భార్యాభర్త ఇద్దరే ఉండటంతో మంచీచెడు చెప్పడానికి పెద్దలు కూడా లేకపోవడంతో మేఘన, గగన్.. గొడవ జరిగిన ప్రతీసారి ఇగోకు పోయేవారు. ఈ క్రమంలోనే.. ఈ మధ్య కూడా గగన్, మేఘన మధ్య గొడవ జరిగింది. 

►ALSO READ | కొద్దిసేపట్లో పెళ్లి.. సినిమా స్టైల్ లో.... ఆపండి అంటూ ఆఫీసర్స్ ఎంట్రీ.. ఏమైందంటే.. ?

ఇద్దరి మధ్య జరిగిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. గగన్ కు వేరొకరితో సంబంధం ఉందని మేఘన అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంలోనే భార్యాభర్త మధ్య గొడవ జరిగి.. ఆ గొడవ కాస్తా పెద్దదై మేఘన అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. మేఘనకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి గగన్ దగ్గరకు పంపించారు. మేఘన తిరిగొచ్చాక ఈ విషయంలో మళ్లీ గొడవ జరిగింది. భార్య అనుమానం, వేధింపులతో విసిగిపోయిన గగన్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కోడలి వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని మేఘనపై గగన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య వేధింపులతో భర్త ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఇటీవల బెంగళూరులో తరచుగా వెలుగుచూస్తుండటం గమనార్హం.