- మంత్రులంతా అందుబాటులో ఉండాలి
- పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలె
- ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలి
- కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు బూత్ స్థాయిలో మానిటరింగ్ చేయండి
- మంత్రులు, ముఖ్యనేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
- పోల్ మేనేజ్ మెంట్ పై రెండున్నర గంటల పాటు మీటింగ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని, ఇప్పుడు మనం మెజార్టీ మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం ముఖ్యనేతలు,పీసీసీ చీఫ్, మంత్రులతో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని, దానిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోల్ మేనేజ్ మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం చెప్పారు.
ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు బూత్ లెవల్ కమిటీలను మానిటరింగ్ చేయాలని అన్నారు. రేపు పోలింగ్ ముగిసే వరకు మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. పోలింగ్ శాతం పెంపు, పార్టీ నేతలు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్ మెంట్ పై సీఎం కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఇలా చేద్దాం..!
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్ రిక్రియేషన్ క్లబ్ లో మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సమావేశంలో భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. పోల్ మేనేజ్ మెంట్ పైనే ప్రధానంగా చర్చించారు.
