హైదరాబాద్: ఢిల్లీలో పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, ముంబై సహా అన్ని ప్రధాన నగరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని అన్ని రైల్వే స్టేషన్లలో అలర్ట్ ప్రకటించిన పోలీసుల బాంబ్ స్వ్కాడ్స్తో తనిఖీలు చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్లో పోలీసులు తనిఖీలు చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, MGBS, JBS, పలు బస్టాండ్స్ రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్ బండ్ ఎక్స్ రోడ్డు దగ్గర భారీగా వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ సిటీలో నాకా బందీలో భాగంగా పోలీసులు రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ సజ్జనార్ నగర ప్రజలను అలర్ట్ చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న సిగ్నల్ దగ్గర సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగింది. స్లోగా వచ్చిన ఒక కారు రెడ్‌లైట్ దగ్గర ఆగింది. రెడ్ లైట్ దగ్గర ఆగిన కారులోనే పేలుడు జరిగిందని -ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మీడియాకు తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
►ALSO READ | ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు.. 9 మంది స్పాట్ డెడ్.. ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్ !
ఇప్పటికే ఈ పేలుళ్ల కేసులో అనుమానితులుగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా వెల్లడించారు. ఫోరెన్సిక్, NIA ఇప్పటికే స్పాట్కు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు.
