నెల్లూరులో విద్యార్థుల డ్రగ్ ముఠా అరెస్ట్..!

నెల్లూరులో విద్యార్థుల డ్రగ్ ముఠా అరెస్ట్..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్టం నెల్లూరు జిల్లాలో ఐదుగురు విద్యార్థుల డ్రగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు.  కావలిలోని ఉదయగిరి రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 16 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా విశాఖ ఏజెన్సీలో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడు వెల్లూరులోని కాలేజీ విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళానికి చెందిన ఎస్‌.పవన్‌కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్‌ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన  అమర్‌నాథ్‌ వేలూరులోని విట్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివారని చెప్పారు. వీరు అక్కడ చదువుతున్నప్పుడే,… గంజాయికి బానిసలయ్యారని చెప్పారు. దీంతో పాటు గంజాయి అక్రమ రవాణా చేస్తూన్నారని తెలిపారు. ఎప్పటిలాగే… విశాఖలో గంజాయిని కొని… కారులో వేలూరు బయలుదేరారు. కావలి లో కారు ఆపి మహారాష్ట్రకు చెందిన ప్రత్యూష్ తో గంజాయి గురించి మాట్లాడుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి కారును చెక్ చేయడంతో విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.