పీవీకి నివాళులర్పించడానికి సీఎంకు తీరిక లేదా: బండి సంజయ్

పీవీకి నివాళులర్పించడానికి సీఎంకు తీరిక లేదా: బండి సంజయ్
  • గతంలో బ్రాహ్మణుల ఓట్లు చీల్చేందుకే పీవీ జపం చేసిండని ఫైర్
  • పీవీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఎందుకు నివాళులు అర్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. దేశమంతా పీవీకి నివాళులు అర్పిస్తుంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రం తీరిక లేదా అని ఫైర్ అయ్యారు. బుధవారం పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన భూమిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాంచందర్ రావు, పీవీ మనువడు, పార్టీ అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్​తో కలిసి సంజయ్  నివాళులు అర్పించారు. 

తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్లు చీల్చేందుకే కేసీఆర్ ఆనాడు పీవీ జపం చేసిండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు అటెండ్ కావడం లేదు. దేశమంతా పీవీ జయంతిని నిర్వహిస్తూ ఆయనను స్మరించుకుంటుంటే కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. పీవీ మరణించిన సమయంలోనూ దహన సంస్కారాలు సరిగా నిర్వహించకుండా ఘోరంగా కాంగ్రెస్ అవమానించింది” అని సంజయ్ ఆరోపించారు.

కుట్రలు చేయడం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటే

రాష్ట్ర నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇదంతా మీడియా సృష్టేనని సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలు విని, విని తమకు అలవాటైపోయిందన్నారు. ‘‘మార్పు ఉంటదో లేదో.. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అడిగి చెప్తా” అని చెప్పారు. ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల వచ్చిన బీజేపీ కార్యకర్తలకు బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో సంజయ్​తో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర నాయకత్వ మార్పుపై తరుణ్ చుగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా మా పార్టీ జాతీయ నేతలంతా ఇప్పటికే అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని చానల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసారం చేస్తున్నాయి” అని తెలిపారు. ఈ లీకులకు సీఎం కేసీఆరే కారణమని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన పార్టీలో ఏం జరుగుతున్నదో చూసుకోకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటేనని ఫైర్ అయ్యారు.