Kolkata Knight Riders: మరికొద్దీ రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ -ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేకేఆర్ టీమ్ కెప్టెన్ గా ఎవరు ఉంటారనే అంశం వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాలతో జట్టు నుంచి తప్పించి.. అతడి ప్లేస్ లో జింబాబ్వే పేసర్ ముజరబానీని తీసుకుంది. జట్టులోని కీలక ప్లేయర్స్ వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలి పెట్టింది. కేకేఆర్ తీరుపై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రియాక్ట్ అయ్యాడు.
శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్ లని విడిచి పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ పెద్ద తప్పు చేసిందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కీలక ప్లేయర్స్ ని అట్టిపెట్టుకోవడం ఎంత ముఖ్యమన్నది వాళ్లు అర్థం చేసుకుంటే తప్ప ఐపీఎల్ టైటిల్ కి కేకేఆర్ అర్హత సాధించలేదని హెచ్చరించాడు. 2024లో శ్రేయస్ ఆధ్వర్యంలో కోల్‌కతా ట్రోఫీ గెలుచుకుంది. అనంతరం అతడు, సాల్ట్ ఆ జట్టును వదిలి పెట్టారు.. శ్రేయస్ పంజాబ్ జట్టులో జాయిన్ కాగా.. సాల్ట్ ఆర్సీబీలో చేరాడు. దాదాపు దశాబ్దం విరామం తర్వాత గత ఏడాది పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరగా.. ఆర్సీబీ తొలిసారి టైటిల్ ని కైవసం చేసుకుంది.. రెండేళ్ల కింద కేకేఆర్ ఐపీఎల్ కప్ విన్నర్ గా నిలిచింది.. మూడోసారి టైటిల్ ని దక్కించుకున్న కేకేఆర్.. విజయంలో శ్రేయస్, సాల్ట్ కీ రోల్ పోషించారని వెల్లడించారు.
►ALSO READ | Abrar Ahmed: ఈసారి సన్‌రైజర్స్ తరపున ఆడని పాక్ ప్లేయర్ అహ్మద్.. ఎన్‌వోసీ ఇవ్వని పీసీబీ
కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ఆ ఇద్దరినీ వదిలి పెట్టుకుంది.. సీనియర్ ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విషయంలో కోల్‌కతాకి నిలకడ లేదని మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. శ్రేయస్, సాల్ట్ ను వదులుకోవాలిని కేకేఆర్ నిర్ణయం తప్పని చెప్పారు. అజింక్యా రహానె రూపంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్ కేకేఆర్ కి ఉన్నప్పటికీ.. కెప్టెన్ గా అతడు ఇంకా టైటిల్ ని దక్కించుకోలేదని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమపై కుంబ్లే ప్రశంసలు కురిపించాడు.
