
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మెన్ గా భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. దీంతో మరో మూడేళ్లు పదవిలో కొనసాగనున్నారు. శనివారం దుబాయ్ లో ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇందులో ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మెన్ గా కుంబ్లేను మరో మారు ప్రకటించారు. 2012లో ఐసీసీ చైర్మెన్ గా మొదటిసారి కుంబ్లే పదవిని స్వీకరించారు. దుబాయ్ లో ఆరు రోజుల పాటు జరిగిన సమావేశంలో కుంబ్లే ఎన్నికపై నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.