బాలయ్యతో కామెడీనా.. ఏంది అనీలన్నా ఇది?

బాలయ్యతో కామెడీనా.. ఏంది అనీలన్నా ఇది?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ ఐన బాలయ్య లుక్స్ కు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్గా మారుతోంది.

తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కామెడీ సీన్స్ కు అనీల్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎంత ఉన్నా.. అదే రేంజ్ లో కామెడీని కూడా సెట్ చేస్తాడు. ఇక బాలయ్య కోసం కూడా సపరేట్ కామెడీ ట్రాక్ ను క్రియేట్ చేసాడట అనిల్. కొంతమంది కమేడియన్స్, బాలకృష్ణ మధ్య ఉండనున్న ఈ సీన్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండనుందని టాక్. త్వరలోనే ఈ సీన్ షూట్ జరగనుందని సమాచారం. అయితే ఈ విషయం తెల్సుకున్న బాలయ్య ఫ్యాన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్య సినిమా అంటే మాస్ బేస్ అదిరిపోయేలా ఉండాలి కానీ.. ఈ కామెడీ ట్రాకులు ఏందీ అనీల్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో బాలయ్యని కామెడీ యాంగిల్ లో చూసి చాలా కాలం అయింది. సూపర్ ట్రాక్ సెట్ చెయ్ అన్నా అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్ నటిస్తుండగా.. కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. మరి ఈ సినిమాలో ప్రత్యేకం కానున్న ఈ కామెడీ సీన్ ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.