
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమల్(Animal) ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిరోజులు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ ఉండసాగేది. అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హవా కూడా కొనసాగుతుంది.ఈ బ్యూటీ యానిమల్లో కనిపించింది చిన్న పాత్రలో అయిన..తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో,రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టవల్ చాటున అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రోజు రోజుకు తన ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయర్స్ సంఖ్య పెంచేసుకుంటోంది.
ఆమెకు యానిమల్ సినిమా రిలీజ్కు ముందు..అంటే నవంబర్ చివరి వారంలో 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉంటది..ఈ లెక్క రోజురోజుకూ అమాంతం ఎంతలా పెరుగుతూ వెళ్తోందని.
ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ‘భూల్ భూలయ్య 3’ సినిమాలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందట. అయితే యానిమల్ సినిమాకు రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట మేకర్స్. అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది..రవితేజ, విజయ్ లాంటి హీరోలకు జంటగా నటించనుందని టాక్. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.