
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ సౌత్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకుంది అంజలి. లీడ్ రోల్స్‌తో పాటు పలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తోంది. శుక్రవారం (ఆగస్టు 22) తను హీరోయిన్‌గా కొత్త మూవీ ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా ఆర్బీ చౌదరి నిర్మాతగా రవి అరసు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా అంజలిని ఎంపిక చేసినట్టు అనౌన్స్ చేశారు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌కు 99వ చిత్రం కాగా, విశాల్ హీరోగా నటిస్తోన్న 35వ చిత్రమిది. ‘మద గద రాజా’ చిత్రం తర్వాత విశాల్, అంజలి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా దుషార విజయన్ నటిస్తోంది. తంబి రామయ్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా, దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.