బీఆర్ఎస్కి కోవర్టుగా చిక్కడపల్లి ఏసీపీ : అంజన్ కుమార్

బీఆర్ఎస్కి కోవర్టుగా చిక్కడపల్లి ఏసీపీ : అంజన్ కుమార్

చిక్కడపల్లి ఏసీపీ.. బీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ కు ఏసీపీ బంధువు అయితే వారి ఇంటికి వెళ్లి భోజనం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఏసీపీ పని చేస్తున్నారని ఆరోపించారు. తన నామినేషన్ లో తప్పులు ఉన్నాయని ఏసీపీ ప్రచారం చేయాల్సిన పని ఏముందని ప్రశ్నించారు.

also read :- తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : రేవంత్ రెడ్డి

ఏదైనా తప్పిదాలు ఉంటే రిటర్నింగ్ అధికారి చూసుకుంటారని చెప్పారు. అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న తమపై ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గ్రహించి చిక్కడపల్లి ఏసీపీ తన పని తాను చేసుకుంటే మంచిదన్నారు. అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో అభివృద్ధి చేయకుండా... ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.