తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : రేవంత్ రెడ్డి

నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు, గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడంగల్ మాదిరిగానే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్​ లో నిర్వహించిన కాంగ్రెస్​ విజయభేరి సభలో రేవంత్​ రెడ్డి మాట్లాడారు. 

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైందన్నారు. ఆదిలాబాద్ ఎడారిగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ఇక్కడి ప్రజల మీద కత్తిలా వేలాడుతోందన్నారు. ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా వాయిదా వేశారని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్​గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో భూములను గుంజుకుంటారని అన్నారు. 

also read :- బ్రేకింగ్ న్యూస్: జమ్మూలో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి

 

మంత్రిగా ఉండి కూడా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. అలాంటి ఇంద్రకరణ్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. నిర్మల్ కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీహరిరావుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. తనకు వేసినట్లే.. సోనియాగాంధీకి వేసినట్లే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత తమదే అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.