జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న : అంజన్ కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న : అంజన్ కుమార్ యాదవ్
  • సిటీలో కట్టర్ కాంగ్రెస్ వాదిని నేనే: అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో కట్టర్ కాంగ్రెస్ వాదిని తానొక్కడినేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రెండుసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచినా.. కేంద్ర మంత్రిని కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తుస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటానని చెప్పారు. జూబ్లీహిల్స్  నియోజకవర్గంలో ఏకే పౌండేషన్ ద్వారా  కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. తన కొడుకు అనిల్ కు యూత్ కాంగ్రెస్ కోటాలోనే రాజ్యసభ సభ్యత్వం వచ్చిందని అంజన్ యాదవ్ పేర్కొన్నారు.